వ్యతిరేకంగా సీపీఐ(ఎం) భారీ ర్యాలీ
కోయంబత్తూరు : తమిళనాడులోని మెట్రో ప్రాజెక్టులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు లౌకిక ప్రగతిశీల కూటమి పార్టీలతో కలిసి సీపీఐ(ఎం) కోయంబత్తూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధి ప్రయోజనాలకు ద్రోహం చేసిందని ఈ ర్యాలీలో పాల్గొన్న నాయకు లు విమర్శించారు. సీపీఐ(ఎం) కోయంబత్తూరు జిల్లా కార్యదర్శి సి.పద్మనాభన్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు, మధురైలకు ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఇటీవల తిరస్కరిం చింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్ వంటి చిన్న నగరాలకు కూడా మెట్రో రైలు ప్రాజెక్టులకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తమిళనాడులో మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష
- Advertisement -
- Advertisement -



