Friday, November 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు'జల్‌జీవన్‌' గ్రాంట్లు కేంద్రం నిలిపివేత

‘జల్‌జీవన్‌’ గ్రాంట్లు కేంద్రం నిలిపివేత

- Advertisement -

8 నెలలుగా వేతనాలు లేని ‘మిషన్‌ భగీరథ’ సిబ్బంది
శాఖకు అవార్డులు వచ్చినా తీరని ఉద్యోగుల కష్టాలు
కనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలంటున్న సిబ్బంది

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/మరిపెడ
జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకంలో ఔట్‌సోర్సింగ్‌పై నియమితులైన 352 మంది సిబ్బందికి 8 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. దాంతో ఆ సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు. నీటి నాణ్యతా విషయంలో బాగా పనిచేసినందుకు తెలంగాణ రాష్ట్రానికి అవార్డు వచ్చింది. ఇంత చేసినా సిబ్బందికి మాత్రం వేతనాలు ఇవ్వకుండా కేంద్రం తాత్సారం చేస్తోంది. గతంలో నేషనల్‌ రూరల్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, వంటలు, ఇతర సౌకర్యార్ధం సురక్షితమైన నీటిని అందించడా నికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2009లో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీటితోపాటు ప్రతి మనిషికి అవసరమైన 55ఎల్‌పీసీడీల నీటిని అందించాలని నిర్దేశించింది.

2019లో ఈ పథకం స్థానంలో కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వచ్చే గ్రాంట్లతో మిషన్‌ భగీరథ పథకం కింద ఏర్పాటు చేసిన తాగునీటి పరీక్షా కేంద్రాల్లో ఔట్‌సోర్సింగ్‌పై వివిధ విభాగాల్లో పనిచేసే 352 మందికి వేతనాలు ఇచ్చేవారు. తాజాగా కేంద్రం జేజేఎం మిషన్‌ గ్రాంట్‌ను రాష్ట్రానికి నిలిపివేయడంతో సిబ్బందికి వేతనాలు బంద్‌ అయ్యాయి. దాంతో ఉద్యోగుల జీవనం కష్టంగా మారింది. మిషన్‌ భగీరథ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 150 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటున్నాయి. వీటిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 352 మంది ఔట్‌ సోర్సిం గ్‌పై పని చేస్తున్నారు. రాష్ట్రంలో డివిజన్‌ స్థాయిలో, జిల్లా స్థాయి లో, సబ్‌ డివిజన్‌ స్థాయి లో, రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్నారు.

76 మంది చొప్పున కెమిస్టులు, మైక్రో బయాల జిస్టులు, ఫీల్డ్‌ అసి స్టెంట్లు, హెల్పర్లు, 20 మంది ల్యాబ్‌ అసిస్టెంట్లు, 20 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది జిల్లా కన్స ల్టెంట్లుగా పని చేస్తున్నారు. 10-20 ఏండ్లుగా ఈ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వీరంతా ప్రీ మాన్‌సూన్‌, పోస్ట్‌ మాన్‌సూన్‌లలో ప్రతినెలా 250 నీటి నమూనాలతో రసాయన పరీక్షలను నిర్వహిస్తారు. 50 నమూనాలను మైక్రో బయాలజిస్టులు పరీక్షిస్తారు. ఏడాదికి మొత్తం 3,600 నీటి నమూనాలను సేకరించి భౌతిక, రసాయనిక సూక్ష్మజీవ సంబంధమైన 13 పరీక్షలను పరీక్షించి పరీక్షా ఫలితాలను ప్రతిరోజు నిర్వహిస్తారు. నెలకు 300 నమూనాలకు సంబంధించిన డేటాను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేస్తుంటారు. అంతే కాకు ండా, శుద్ధనీటి నమూనా లను రీచెక్‌ చేస్తూ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల నీటి నమూ నాలను ఆలం క్వాలిటీ టెస్టులను అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు.

తీవ్ర పనిభారం
ఈ సిబ్బంది చేస్తున్న పనులకు అదనంగా పలు పనులను అప్పగించారు. మిషన్‌ భగీరథ నీటి వాడకంపై ప్రజల్లో ఉన్న అపోహ లను తొలగించేలా పంచాయతీ సిబ్బం ది, ప్రజా ప్రతినిధు లకు అవగాహన కలి గిస్తున్నారు. ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు, అంగన్‌ వాడీలకు అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. ఆశా వర్కర్లు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షకు లకు, గ్రామ ప్రజలకు సైతం శుద్ధ నీటిపై అవగాహన పెంచుతున్నారు. వరదల సమయంలో అదనపు విధులు, శ్రీరామ నవమి, మేడారం తదితర జాతరల్లో అదనంగా పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే పలు సర్వేల్లో జీయో ట్యాగింగ్‌, ఎన్నికల విధులు, కోవిడ్‌ సమయంలో స్పెషల్‌ ఆఫీసర్‌ విధులను సైతం వీరు నిర్వహించడం గమనార్హం. వీరు అదనపు పనిభారంతో విధులను నిర్వహిస్తున్నా, వీరికి పే స్కేల్‌ వర్తింపు, నెలవారీ వేతనాలు అందడం లేదు.

పెండింగ్‌లో రూ.5 కోట్ల వేతనాలు
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ పై నియమితులైన 352 మంది సిబ్బందికి 2025 ఏప్రిల్‌ నుంచి వేతనాలు ఇవ్వక పోవ డంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ గ్రాంట్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో వీరి వేతనాలూ నిలిచిపోయాయి. 8 నెలలుగా వేతనాలు ఇవ్వక పోవడం పట్ల సిబ్బంది ఆందోళన చెందుతు న్నారు. కెమిష్టులు, మైక్రో బయాలజిస్టులకు నెలకు రూ.20 వేలు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.19 వేలు, హెల్పర్లకు రూ.15 వేల వేతనాన్ని ఇస్తున్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి
అరకొర వేతనాలిస్తున్నా మా శాఖ పరిధిలోని విధులే కాకుండా అదనపు విధులను నిర్వహిస్తున్నాం. మాకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలను సకాలంలో ఇస్తే మరింత మెరుగైన పని చేయగలం. వెంటనే మాకు వేతనాలిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి.
కరణం ఉదయ్‌రావు, అధ్యక్షులు, వాటర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ ల్యాబరేటరీ అసోసియేషన్‌

రాష్ట్రానికి అవార్డు మా ఘనతే
మా ల్యాబ్‌ ఉద్యోగులు మెరుగైన సేవలందించి నందునే తెలంగాణకు నీటి నాణ్యత పర్యవేక్షణలో జాతీయ స్థాయి అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ అవార్డు రావడం మా ఉద్యోగుల ఘనతే. ఇంత బాధ్యతా యుతంగా పనిచేస్తున్న మాకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడం దురదృష్టకరం. వెంటనే వేతనాలు విడుదల చేసి పే స్కేల్‌ వర్తింపచేయాలి.
పుల్లగుర్ల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి, వాటర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ ల్యాబరేటరీ అసోసియేషన్‌

కనీస వేతనాలివ్వాలి
మిషన్‌ భగీరథ పథకం కింద దశాబ్దాల తరబడి పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలి. 8 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. వెంటనే ప్రభుత్వం స్పందించి వీరికి కనీస వేతన చట్టాన్ని వర్తింపచేయాలి.
సాదుల శ్రీనివాస్‌ కార్యదర్శి, సీపీఐ(ఎం), మహబూబాబాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -