Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనవతెలంగాణ అకౌంటెంట్‌ మేనక కుటుంబాన్ని పరామర్శించిన సీజీఎం, ఎడిటర్‌

నవతెలంగాణ అకౌంటెంట్‌ మేనక కుటుంబాన్ని పరామర్శించిన సీజీఎం, ఎడిటర్‌

- Advertisement -

నవతెలంగాణ-అక్కన్నపేట
నవతెలంగాణ పత్రిక హెడ్‌ ఆఫీస్‌ అకౌంటెంట్‌ మేనకను, కుటుంబీకులను సీజీఎం ప్రభాకర్‌, ఎడిటర్‌ ఆర్‌.రమేష్‌ ఆదివారం పరామర్శించారు. మేనక తండ్రి గత నెల 28వ తేదీన ప్రమాదవశాత్తు మృతిచెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభకు నవతెలంగాణ దినపత్రిక సీజీఎం ప్రభాకర్‌, ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌ హాజరయ్యారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ దినపత్రిక మొఫిషియల్‌ ఇన్‌చార్జి వేణుమాధవ్‌రావు, ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు బీవీఎన్‌ పద్మరాజు, సలీమా, కేఎన్‌ హరి, ఎన్‌. అజయ్ కుమార్‌, సిబ్బంది భాగ్యం, ధనలక్ష్మి, మల్లీశ్వరి, భారతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img