Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చైన్ స్నాచర్స్ అరెస్ట్..

చైన్ స్నాచర్స్ అరెస్ట్..

- Advertisement -

3తులాల పుస్తెలతాడు స్వాధీనం.!
నవతెలంగాణ – హలియా

హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ఒక మహిళ మెడలో మూడు తులాల పుస్తెలతాడును దొంగిలించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు, హాలియా సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ బండి సాయి ప్రశాంత్ శనివారం తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం మండలంలోని శ్రీనాథపురం స్టేజి వద్ద గత నెల 27వ తేదీ సాయంతం గ్రామం వైపు వెళ్తున్న ఒక మహిళ మెడలో నుంచి ఇద్దరు యువకులు పల్సర్ బైక్ పై వచ్చి మూడు తులాల బంగారు పుస్తెలతాడును దొంగిలించినట్లు చెప్పారు. ఈ విషయమై బాధితమైన మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పుస్తెలతాడు దొంగిలించిన దొంగలను పట్టుకునేందుకు హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో శనివారం ఎస్సై సాయి ప్రశాంత్ కొత్తపల్లి గ్రామ శివారులో బాలాజీ రైస్ మిల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పట్టుకుని విచారించగా దొంగతనం చేసినట్లు చెప్పారని తెలిపారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరి యువకులు పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన కల్లూరి బ్రహ్మారెడ్డి, మూల మాధవ రెడ్డిలుగా గుర్తించినట్లు చెప్పారు. వీరి నుంచి పల్సర్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు, దొంగలు తమ స్వగ్రామమైన చలకుర్తిలో తమ నివాసంలో వారు దొంగిలిం చిన మూడు తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరి యువకులని అరెస్టు చేసి రిమాండ్ కు తర లించినట్లు చెప్పారు. ఈ కేసును చేదించడంలో హాలియా సీఐ సతీష్ రెడ్డి, హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్, నిడమనూరు ఎస్ఐ సురేష్, పోలీసులు సురేష్, హరి ప్రసాద్, వెంకటేశ్వర్లు, రమేష్ గౌడ్, హఫీస్, శివరాజ్, రైటర్ కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad