Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చైన్ స్నాచింగ్ దొంగ అరెస్ట్         

చైన్ స్నాచింగ్ దొంగ అరెస్ట్         

- Advertisement -

పేకాటలో అప్పులు తీర్చేందుకు దొంగ తనాలు  
3 తులాల బంగారం రికవరీ 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

బైక్ పై తిరుగుతూ మహిళల మెడలో బంగారు గొలుసు లాక్కెల్లిన    చైన్ స్నాచింగ్ దొంగని మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీ ఎస్పీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో డీ ఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం…. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన మందడి వినోద్ తాగుడు పేకాట ఆడుతూ జల్సాలకు అలవాటు పడి  అప్పులు చేశాడు.  అప్పులు ఇచ్చిన వారి వత్తిడి పెరగడంతో అప్పులు తీర్చేందుకు దొంగ తనాలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు.

ఈ నెల 14న మిర్యాలగూడలోని బంగారుగడ్డ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను బైక్ పై అనుసరించి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని వెళ్ళాడు.  దొంగిలించిన బంగారాన్ని హుజూర్ నగర్ కి చెందిన తన స్నేహితురాలు షేక్ నజ్మా కి ఇవ్వగా ఆమె శ్రీ రాం ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి రూ.  2లక్షల 30 వేలు లోన్ తీసుకొచ్చింది. ఆ సొమ్ములో 80 వేలు అప్పులు తీర్చి మిగతాది పేకాట లో నష్ట పోయాడు.

అయితే మళ్ళీ దొంగతనం చేసేందుకు బుధవారం మిర్యాలగూడ కి వచ్చిన వినోద్ వాహనాన్ని పోలీసులు రౌండ్ దగ్గర నిలిపి విచారించగా పారి పోయందుకు యత్నించగా అదుపులోకి తీసుకొని విచారించగ నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. వినోద్ వద్ద నుంచి 3తులాల 2గ్రాముల బంగారం సెల్ ఫోన్ బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆతని స్నేహితురాలు నజ్మా ని అదుపులోకి తీసుకొని కోర్టు కు రిమాండ్ కి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు చేదనలో ప్రతిభ చాటిన సీఐ సోమనర్సయ్య, ఎస్సై రాంబాబు, ఏ ఎస్సై చంద్రయ్య, స్వర్ణ, అక్బర్, లక్షమయ్య, రామకృష్ణ లను డీ ఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -