వచ్చే సమావేశాలు ఇందులోనే : గుత్తా
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో, తెలంగాణ శాసనమండలి భవనం పున:నిర్మాణ పనులను చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అతిత్వరలోనే శాసనమండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.
శాసనసభ, మండలి కార్యదర్శి డా. నరసింహాచార్యులు, ఆర్‌అండ్‌బీ, అగాఖాన్ సంస్థ, తదితర అధికారులతో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. చైర్మెన్ మాట్లాడుతూ రాబోయే సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. శాసనమండలి నూతన సమావేశ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అతిత్వరలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్టు చెప్పారు. తాజాగా ఇప్పటి వరకు పూర్తయిన పనుల గురించి సీఎం ఆరా తీశారనీ, కచ్చితంగా శాసనమండలి సమావేశాలు పాతభవనంలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా వేగం పెంచాలనీ, త్వరగా భవనాన్ని పూర్తిచేసి శాసనమండలి అధికారులకు అప్పగించాలని కాంట్రాక్టు సంస్థకు సూచించారు .
శాసనమండలి పున:నిర్మాణపనులను పరిశీలించిన చైర్మెన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



