- Advertisement -
భూగోళపు అణువణువూ
ప్రవహించే మానవత్వపు రుధిరం
దేశభక్తిని చాటదు
విశ్వ గీతమాలపించే ప్రపంచ కంఠాలు
దేశ సరిహద్దుల్లోనే నిలబడిపోవు
మానవుడా! నిలబడిన చోటే నిలబడి
రాతి స్థంభానివైపోకు
కదులు కదిలించు ప్రపంచ మానవాళికి
సరిహద్దులు లేని ప్రేమను పంచే
చైతన్య గీతం వినిపించు
డా. కొరుప్రోలు హరనాథ్
9703542598
- Advertisement -


