Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాదకరంగా చలకుర్తి ఎక్స్ రోడ్డు..

ప్రమాదకరంగా చలకుర్తి ఎక్స్ రోడ్డు..

- Advertisement -
  • – బురదమయంగా రహదారి
    – మోకాళ్ల లోతు గుంతలు..
    – ఇబ్బందుల్లో వాహన దారులు
    నవతెలంగాణ – పెద్దవూర
    నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్తి ఎక్స్ రోడ్డు హైదరాబాద్-నాగార్జున  సాగర్ వెళ్లే రహదారి పక్కన పర్వేదులకు వెళ్లే జంక్షన్ వద్దపూర్తి వర్షం నీటితో బురద మయంగా మారింది. పేరుపెద్ద ఊరు దిబ్బ అనే చందం వీధులన్నీ మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడి వాహన దారులు బేంబే లెట్టుతున్నారు.కనీసం నడవడానికి ఇబ్బందిగా మారింది. చాలకుర్తి ఎక్స్ రోడ్డు నుంచీ పర్వీదుల గ్రామానికి కు వెళ్లే రోడ్డుపెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వర్షాలు కురిసినప్పుడు రోడ్లు బురదమయంగా మారి ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. గత ఐదు l రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారి అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. దీంతో అటుగా వెళ్లే 10 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అందులో ఐదు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. 20 ఏళ్ల క్రితం కింద వేసిన ఈ రోడ్డు అధ్వానంగా మారింది. ముఖ్యంగా ఆరోడ్డు పర్వేదుల,పులిచర్ల వరకు అక్క డక్కడ  మోకాళ్ళ లోతులో గుంతలు ఏర్పడి నీళ్లు చేరడం తో నానా అవస్థలుపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు బాగుచేయాలని వాహన దారులు, వివిధ గ్రామాల.ప్రజలు కోరుతున్నారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -