Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చలో హైదరాబాద్ దళిత ఆత్మగౌరవ ర్యాలీ విజయవంతం చేయాలి..

చలో హైదరాబాద్ దళిత ఆత్మగౌరవ ర్యాలీ విజయవంతం చేయాలి..

- Advertisement -

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుడి గాని పల్లి రాజు..
నవతెలంగాణ – వెల్దండ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయి పైన అడ్వకేట్ రాకేష్ కిషోర్ కాలి బూటు వేయడం తగదని నిరసిస్తూ నవంబర్ 1న చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ మహా ర్యాలీ ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గుడి గాని పల్లి రాజు  అన్నారు. వెల్దండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంద కృష్ణ మాదిగ  ఆధ్వర్యంలో నవంబర్ 1 న చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ మహా ర్యాలీ ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ శనివారం మండల ఎమ్మార్పీఎస్ ఇంచార్జి మంగళగిరి శ్రీను అధ్యక్షతన   సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుడిగానిపల్లి రాజు మాట్లాడుతూ .. సుప్రీం కోర్టు ప్రధాన మూర్తి బి ఆర్ గవాయి  మీద అడ్వాకేట్ రాకేష్ కిషోర్ అను వ్యక్తి బూటుతో దాడి చేయడం రాజ్యాంగం దాడి చేయడమేమన్నారు. స్వతంత్రం వచ్చి 80 యేండ్లు కావొస్తున్న దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని…. దళితులు ఏ వ్యవస్థలో ఉన్న అవమాన కరమైన సంఘటనలు పునరానృతం అవుతూనే  ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గవాయి మీద దాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండ  ఢిల్లీ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ పూర్తిగా విఫలం  అయ్యారని ఆయన దుయ్యబట్టారు. 

గవాయి మీద దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై కేసు పెట్టి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల ఆత్మ గౌరవ మహా ర్యాలీ ప్రదర్శన లో వివిధ సంఘాల, రాజకీయ, ప్రజా సంఘాల దళితులు పాల్గొనాలనీ  విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బల్లె జగన్ , ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి,బహుజన వాది కానుగుల జంగయ్య, మాలమహానాడు రాష్ట్ర నాయకుడు నిరంజన్ , మంగళగిరి సత్యం ,  గ్రామ కమిటీ నాయకులు  రమేష్ మాదిగ, మండల నాయకులు  పెద్దయ్య , అంజయ్య, నవీన్ తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -