నవతెలంగాణ – ఆర్మూర్
ఈనెల 28న ఛలో సబ్ కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయాకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తాం అని పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు  ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియాంబర్స్ లను విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరాలుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు, విద్యాసంస్థల వారు ఆందోళనలు చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదని అన్నారు. వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.  పేద, మధ్య తరగతి విద్యార్థులపైన ఆర్థిక భారం పడి విద్యను అభ్యసించడం కష్టతరం అవుతుందన్నారు. ఒకవైపు కాలేజీలను నిర్వహించడం ఇబ్బంది అవుతుందని, ప్రయివేట్ యజమాన్యాలు చెప్పడం, ప్రభుత్వం చర్చలు జరపకపోవడం వారికి నిధులు కేటాయించకపోవడం వల్ల వారు కూడా కళాశాలలో బంద్ చేశారని తెలిపారు. ఎప్పుడు విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల సమయంలో ఈ నిర్ణయం ద్వారా  చాలా మంది విద్యార్థులు నష్టపోతారని అన్నారు. దీని వలన  పరీక్షలకు ఇబ్బందిగా మారుతుందని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఈ సమస్యను పరిష్కారానికి ఈనెల 28న ఆర్మూర్ సబ్ కలెక్టర్ ముట్టడి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు తరలిరావాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఏరియా అధ్యక్షులు నిఖిల్, నాయకులు వివేక్, ఖుషి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 28న ఛలో సబ్ కలెక్టరేట్
- Advertisement -
- Advertisement -

                                    

