రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మీడియాతో మాట్లాడుతూ,”ఛాంపియన్’ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో జరిగే కథ. ఇండిపెండెన్స్ సమయంలో జరిగే కథలు ఇప్పుడు వరకు ఎక్కువగానే వచ్చాయి. ఆ చిత్రాల్లో బ్రిటీషర్స్‌తో జరిగిన పోరాటాన్ని చూపించారు. కానీ ఇందులో కథ చాలా ప్రత్యేకమైనది. నిజాం కాలంలో గ్రామాలు, ప్రజలు, ఎమోషన్స్‌ని చాలా విభిన్నంగా ఇందులో చూపించారు. పీరియడ్ సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక టైం నుంచి మరో టైంలోకి వెళ్లి ఒక కాలాన్ని చూడడమనేది ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.
‘మహానటి’ సినిమా కూడా అలాంటి అనుభూతిని ఇచ్చిన సినిమానే. ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి తెలంగాణ జానపదంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్‌ని మిళితం చేసి, ఒక కొత్త జోనర్‌ని క్రియేట్ చేసే అవకాశం ఈ కథ కల్పించింది. ఇందులో ఎమోషన్స్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి. డైరెక్టర్ ప్రదీప్ ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది అనిపించింది. ఈ కథ ఐడియా చాలా యూనిక్‌గా ఉంటుంది. మీరు సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఐడియాతో ఇప్పటివరకు ఎవరు సినిమా చేయలేదు అనిపిస్తుంది. ‘గిరగిర..’, ‘సల్లంగుండాలి..’ పాటలకి మంచి స్పందన లభించింది. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇంకో రెండు రిలీజ్ కాబోతున్నాయి’ అని అన్నారు.
‘ఛాంపియన్’.. ఓ యూనిక్ కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


