ఫైనల్లో 3-0తో ముంబయి మీటియర్స్‌పై గెలుపు
ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్ చాంపియన్‌గా బెంగళూరు టార్పెడోస్ నిలిచింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోజరిగిన పీవీఎల్ టైటిల్ పోరులో ముంబయి మీటియర్స్‌పై 3-0తో బెంగళూరు టార్పెడోస్ అదిరే విజయం నమోదు చేసింది. మూడు సెట్ల థ్రిల్లర్‌లో 15-13, 16-4, 15-13తో బెంగళూరు టార్పెడోస్ తిరుగులేని విజయం సాధించింది. బెంగళూరు టార్పెడోస్ నుంచి జోయెల్ బెంజిమిన్, సేతు, మాట్ వెస్ట్, జెలెన్ పెన్రోస్‌లు రాణించారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ వరుసగా నాల్గో సీజన్‌లో కొత్త చాంపియన్‌ను చూసింది. తొలి సీజన్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స, రెండో సీజన్లో అహ్మదాబాద్ డిఫెండర్స్, మూడో సీజన్లో కాలికట్ హీరోస్ పీవీఎల్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే.



