యువత, విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తి కై కృషిచేస్తా
నవతెలంగాణ – కంఠేశ్వర్
బీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె చంద్రశేఖర్ ను ఎకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు భీం ఆర్మీ జిల్లా అధ్యక్షులు అజయ్ రావణ్ తెలిపారు. మంగళవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో బీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చంద్ర శేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తన చేతుల మీదుగా బాధ్యత ఇచ్చినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. భీం ఆర్మీ ఆశయ సాధన కోసం,సంస్థ ఆశయాలు నియమాలను సమాజంలో తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ సందర్భంగా నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడిన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇచ్చినందులకు నా బాధ్యతను నిర్వర్తిస్తానని చంద్రశేఖర్ అన్నారు. అలాగే విద్యార్థులు, యువజనుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను సంస్థ అభివృద్ధి కి కృషి చేస్తానని చంద్ర శేఖర్ తెలిపారు.ఈ సందర్బంగా అందరికి కృతజ్ఞతలు తెలిపారు.



