- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20న కాకుండా 22వ తేదీకి అపాయింటెడ్ డేను మారుస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 20న సరైన ముహూర్తాలు లేవని, తేదీని మార్చాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.
- Advertisement -



