Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక బుకింగ్ విధానంలో మార్పు.!

ఇసుక బుకింగ్ విధానంలో మార్పు.!

- Advertisement -

ఆన్లైన్లోనే కూపన్ల జారీ
అక్రమ రవాణాకు చెక్ పడేనా.?
నవతెలంగాణ – మల్హర్ రావు

ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా,బుకింగ్ విధానంలో మార్పు చేసినట్లుగా తెలుస్తోంది.అక్రమ రవాణాపై పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ‘మన ఇసుక వాహనం’ పేరిట ఆన్లైన్లో కూపన్లు జారీ చేయాలని నిర్ణయించిన్నట్లుగా తెలిసింది.ఈమేరకు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్, ఎండీ భవేష్ మిశ్రా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.వచ్చే నెల నుంచి నూతన విధానం అమల్లోకి రానున్నట్లుగా తెలుస్తోంది.

మ్యానువల్ విధానానికి స్వప్తి..
ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక అందిస్తోంది.సమీప వాగులు,మానేరు తదితర ప్రాంతాల నుంచి గృహ నిర్మాణదారులు ఉచితంగా తీసుకెళ్ళొచ్చు.ప్రయివేటు నిర్మాణాలకు మాత్రం ఒక్కొక్క త్రిప్పుకు రూ.400 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.ఈ మొత్తాన్ని ట్రాక్టర్ యజమానులు జిల్లా మైనింగ్ శాఖ నిర్దేశించిన కలెక్టర్ ఖాతాకు పంపిస్తారు.

మీసేవ నుంచి నగదు చెల్లింపునకు సంబంధించిన ప్రిoటౌట్ సంబంధించిన తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తారు.వాటిని తహశీల్దార్ దృవీకరించి అనంతరం ఆర్ఐలు బుకింగ్ కూపన్లు జారీ చేస్తారు.వాటి ద్వారా ట్రాక్టర్ యజమానులు  ఇసుక తరలించాల్సి ఉంటుంది.అయితే ఒక కూపన్ లో అక్రమాలు జరుగుతున్నట్లుగా ప్రభుత్వం భావించింది. ఒక ట్రిప్ అనుమతితో నాలుగైదు త్రిప్పుల వరకు తరలిస్తున్నట్లుగా గుర్తించింది.ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా బుకింగ్ విధానంలో మార్పు తీసుకోచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆన్లైన్లోనే అనుమతులు..
ఇసుక బుకింగ్ విధానంలో మ్యానువల్ పద్ధతికి స్వస్తి పలికిన ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లోనే కూపన్లు జారీ చేయాలని కలెక్టర్లు, మైనింగ్ అధికారులను ఆదేశించింది. టీజీఎంఐవీ వెబ్సైట్ లో మన ఇసుక వాహనం పేరిట ప్రత్యేక ప్రాఫార్మాను అందుబాటులో ఉంచింది. ఈ అనుమ తుల జారీ, పర్యవేక్షణ కోసం తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శులను నోడల్ అధికారులుగా నియమించాలని ఆదేశించించినట్లుగా తెలుస్తోంది. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించిన వారికి అనుమతులు జారీ చేస్తారు.మండలాలు, గ్రామాల వారీగా ఎన్ని కూపన్లు జారీ అయ్యాయి,ఎన్ని ట్రాక్టర్ల ఇసుక తరలుతుందనే దానిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.తద్వారా ఇసుక అక్రమ రవాణాకు చెకపడటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశ ముందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -