- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే, విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. విశాఖపట్నం-లింగంపల్లి (12806) రైలు ఉదయం 6.20కి బయల్దేరి రాత్రి 7.15కి లింగంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి-విశాఖపట్నం (12805) రైలు ఉదయం 6.55కి బయల్దేరి రాత్రి 7.50కి విశాఖపట్నం చేరుకుంటుంది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో కొన్ని వీక్లీ రైళ్లను మరికొన్ని వారాలు పొడిగించారు.
- Advertisement -



