- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : భారతీయ రైల్వే ఛార్జీల పెంపును ప్రకటించింది. ఈ నెల 26 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీ. కంటే తక్కువ దూరం ప్రయాణాలకు ఛార్జీలను పెంచలేదు. అంతకుమించి దూరాలకు.. ఆర్డినరీ క్లాస్‌లో కి.మీ.కు 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ నాన్-ఏసీ, ఏసీలకు కి.మీ.కు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది. ఈ మార్పులతో రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా.
- Advertisement -



