- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈనెల 11న మొదటి విడత, 14న రెండో దశలో పోలింగ్ ముగిసింది. తాజాగా బుధవారం మూడో విడత పోలింగ్ ముగిసింది. అదే విధంగా ఆయా గ్రామాల్లో నూతన సర్పంచ్ కొలువుదీరనున్నారు. అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు మెంబర్లు కలిసి ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనుండగా తాజాగా వాయిదా పడింది. 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నూతన సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
- Advertisement -



