Monday, December 15, 2025
E-PAPER
Homeజాతీయంలోక్ స‌భ‌లో గంద‌ర‌గోళం

లోక్ స‌భ‌లో గంద‌ర‌గోళం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు (11వరోజు) ప్రారంభమయ్యాయి. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేటాయింపుల బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం వ్యయ అవసరాలను తీర్చడానికి.. భారత సంఘటిత నిధి నుండి కొన్ని అదనపు మొత్తాలను చెల్లించడానికి, కేటాయించడానికి అనుమతి కోరుతూ నేడు లోక్‌సభలో అప్రాప్రియేషన్‌ (నెం. 4) బిల్లు 2025ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ చట్టానికి పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్‌ యోజన అనేపేరు మార్చేందుకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కాగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు నేడు లోక్‌సభలో ఒక కాంగ్రెస్‌ ఎంపి ప్రధాని మోడీనుద్దేశించి దుర్భాలాషలాడారని ఆరోపించారు. ఒక ర్యాలీలో కాంగ్రెస్‌ ఎంపి ఆ పార్టీ అగ్రనాయకుల సమక్షలో ప్రధాని మోడీకి సమాధి తవ్వాలని రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీనికి కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని కిరణ్‌ రిజిజు డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ మధ్యాహ్నం 12కి వాయిదా పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -