Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా నిల్వలపై తనిఖీలు..

యూరియా నిల్వలపై తనిఖీలు..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని పీఏసీఎస్,కల్లేపల్లిలోని ఎరువుల దుకాణాలను ఏఓ సంతోశ్ సోమవారం సందర్శించి యూరియా నిల్వలను తనిఖీ చేశారు. యూరియా నిల్వలు,అమ్మకాల వివరాల రికార్డులు,ఈ పాస్ యంత్రాలను ఏఓ పరిశీలించారు. అనంతరం కల్లేపల్లిలోని పత్తి చేనును పరిశీలించి రైతులు మోతాదు మించి యూరియ వినియోగాన్ని నివారించాలని సూచించారు.

నీరు నిలిచిన పత్తికి సస్యరక్షణ ..

వర్షాల కారణంగా నీరు నిలిచిన పత్తి చేనులో పత్తి మొక్కలు చనిపోతే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. ఒక లీటర్ నీటికి చొప్పున చెట్టు మొదలులో నాజిల్ తీసి పోయాలని..పచ్చ దోమ,పెనుబంక ఆశిస్తే ఈమిడా క్లోప్రీడ్ ఎకరానికి 250 ఎంఎల్ పిచికారీ చేసుకోవాలని ఏఓ సంతోశ్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -