నవతెలంగాణ – ముధోల్
నిర్మల్ నుండి కళ్యాణ్ ఎన్ హెచ్ 61 ప్రస్తుత రెండు వరుసల రోడ్డును తెలంగాణ పరిధిలోని 53 కి.మీ లు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం మంజూరు చేయడం పై ముధోల్ బిజేపి నాయకులు తాటివార్ రమేష్ సోమవానం ఒక్క ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, ఎంపీ గోడం నగేష్ డిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కీ ఈ రోడ్డు విస్తరణ పనులపై విన్నవించారని ఆయన తెలిపారు. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 15 రోడ్లను నాలుగు వరుసల జాతీయ రహదారులుగా నిర్మాణం చేపట్టుటకు రూ. 33,690 కోట్ల వ్యయంతో 2028 సంవత్సరం వరకు పూర్తి చేయాలని నిర్ణయించిందని అన్నారు.
దీనికి సంబంధించిన పూర్తి డిపిఆర్ ను త్వరగా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో నిర్మల్, భైంసా నాలుగు వరుసల రహదారి కూడా ఉందన్నారు. ఈ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే రోడ్డు ప్రమాదాలతో పాటు, ట్రాఫిక్ సమస్యలు కూడా తీరనున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో నిర్మల్ జిల్లా కు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉమ్మడి జిల్లా కు ఎమ్మెల్యే లు రామారావు పటేల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్వాయి హరిష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.