– అక్టోబర్ 30-నవంబర్ 27న నిర్వహణ
– అధికారికంగా వెల్లడించిన ఫిడె
బటుమి (జార్జియా) : ప్రపంచ చదరంగ చక్రవర్తిగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న భారత్.. ఈ ఏడాది ఫిడె చెస్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. జార్జియాలోని బటుమిలో జరిగిన ఫిడె సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ప్రపంచకప్ జరుగనుంది. షెడ్యూల్‌ను ప్రకటించినా, భారత్‌లో ఆతిథ్య నగరం ఎంపిక సహా ఇతర అంశాలను త్వరలోనే ప్రకటిస్తామని ఫిడె తెలిపింది. ప్రపంచ చదరంగ పండుగలో 206 మంది క్రీడాకారులు పోటీపడతారు. తొలి రౌండ్ నుంచే ఓడిన ఆటగాడు టోర్నీ నుంచి నిష్క్రమించే కఠినమైన ఫార్మాట్‌లో సాగే ప్రపంచకప్‌లో టాప్-3లో నిలిచిన ముగ్గురు నేరుగా క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తారు. ప్రపంచ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు, 2023 ప్రపంచకప్ రన్నరప్ ఆర్. ప్రజ్ఞానంద, వరల్డ్ నం.5 అర్జున్ ఎరిగేశి భారత్ నుంచి ఈసారి ప్రపంచకప్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు.
భారత్‌లో చెస్ వరల్డ్‌కప్
- Advertisement -
- Advertisement -