ఆదరిస్తాం…గెలిపిస్తాం అంటున్న..నాచారం గ్రామ ఓటర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామ సర్పంచ్ స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిసిన చేవూరి స్వప్న-దేవరాజు ప్రచారంలో దుసుకెళ్ళుతున్నారు. గ్రామంలో ఏ వార్డుకు వెళ్లిన ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతూ వారిని ఆదరిస్తాం..అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటూ ఓటర్లు బాహాటంగానే అంటున్నారు. ప్రజలు తమను ఆదరించి తమ బ్యాట్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామస్తులకు ఇచ్చిన హామీలన్నీ తుచ తప్పకుండా అమలు చేస్తామంటున్నారు. చేవూరి దంపతులు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై కలుపుగోలుగా పోతున్న ఆ చేవూరి దంపతులను తమ సంపూర్ణ మద్దతుతో గెలిపిస్తామని పురవీధుల్లో చర్చనీయంగా మారడం మరో విశేషం.
జోరు ప్రచారంలో నాచారం సర్పంచ్ అభ్యర్థి చేవూరి స్వప్న-దేవరాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



