Sunday, March 29, 2026
E-PAPER
Homeసినిమా'చిచ్చు బుడ్డి..' వేడుకలాంటి పాట

‘చిచ్చు బుడ్డి..’ వేడుకలాంటి పాట

- Advertisement -

కథానాయకుడు అడివి శేష్‌ నటించిన పాన్‌-ఇండియా యాక్షన్‌-రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘డెకాయిట్‌’. ఏప్రిల్‌ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్‌ శనివారం సెకండ్‌ సింగిల్‌ ‘చిచ్చుబుడ్డి’ని విడుదల చేశారు. ఈ పాట సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇందులో అడివి శేష్‌ తొలిసారిగా తెరపై డ్యాన్స్‌ చేస్తూ హై-ఎనర్జీ అవతార్‌లో అదరగొట్టారు. సంగీత దర్శకుడు భీమ్స్‌ ఫోక్‌ బీట్‌లతో కూడిన పార్టీ జోనర్‌ పాట కంపోజ్‌ చేశారు. భాస్కరభట్ల రవికుమార్‌ విజువల్‌కి సరిపోయే సరదా, ఆటపట్టించే సాహిత్యం అందించారు. జోనితా గాంధీ తన ఎనర్జిటిక్‌ వోకల్స్‌తో ఈ పాటకు పవర్‌ యాడ్‌ చేశారు.

తన గ్లామరస్‌ డ్యాన్స్‌తో తెరపై కూడా మెరిశారు. భోజ్‌పురి స్టార్‌ పవన్‌ సింగ్‌ ప్రత్యేక పాత్రలో కనిపించి, అందరినీ కట్టుకునే మాస్‌ వైబ్‌ను నింపారు. భారీ, జనాలతో కూడినసెట్‌లో, కళ్లు చెదిరే కొరియోగ్రఫీతో చిత్రీకరించబడిన ‘చిచ్చుబుడ్డి’ ఒక వేడుకలా అనిపిస్తుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రంలో శేష్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. ఈ చిత్రంతో షానియల్‌ డియో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, ధనుష్‌ భాస్కర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -