Thursday, December 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఢిల్లీలో ముఖ్యమంత్రి

ఢిల్లీలో ముఖ్యమంత్రి

- Advertisement -

శరద్‌ పవార్‌ నివాసంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంకతో భేటీ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ, సక్సెస్‌, వచ్చిన పెట్టుబడుల వివరాలను పార్టీ అధిష్టానానికి వివరించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడే ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సహా పార్టీ అగ్రనేతల్ని కలిసి గ్లోబల్‌ సమ్మిట్‌ వివరాలు తెలుపనున్నారు. అలాగే ప్రధాని నరేంద్రమోడీని కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. బుధవారం రాత్రి ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ నాయకులు శరద్‌ పవార్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రయివేటు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. అక్కడే రాహుల్‌ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -