నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద శనివారం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కేక్ కట్ చేసి సoబరాలు చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుoకేట రవి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా గ్రామగ్రామానా పాదయాత్ర చేసి పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో రైతులకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాలేపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కూరి దేవేందర్, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్, నాయకులు దులూర్ కిషన్ గౌడ్, నూకల బుచ్చి మల్లయ్య, అజ్మత్ హుస్సేన్, అజహార్, కుందేటి శ్రీనివాస్, నాగరాజు, పూజారి శేఖర్, అల్గోట్ రంజిత్, కౌడ అరవింద్, డాక్టర్ నరేష్, రాజేశ్వర్, ఉట్నూర్ నరేందరర్, పడాల నడిపి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.



