Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మొదటి విడత లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలోకి వచ్చిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ ఇంటి వద్దనే లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్ మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు రామ, లత, సుమలత, దివ్య, గాయత్రీ లకు లక్ష రూపాయలు ఖాతాలో జమ అయినట్లు తెలిపారు.

మొదటి విడత లక్ష రూపాయల తమ ఖాతాల్లో జమ అవ్వడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. తమ సొంతింటి కలలు నెరవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, ఊట్నూరి  ప్రదీప్, నల్ల సాయికుమార్, దులూర్ కిషన్ గౌడ్, ముత్యాల చంద్రకాంత్ రెడ్డి, శివసరం నరేష్, పూజారి శేఖర్, సింగిరెడ్డి శేఖర్, దీపక్, సుంకరి గంగాధర్, ప్రతాప్, వేములవాడ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -