- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : స్కూలుకు వెళ్లిన తొలిరోజే చిన్నారిని బస్సు చిదిమేసింది. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. ఎంవీనగర్‌కు చెందిన శ్రీధర్, వనజ దంపతులకు ఐదేళ్ల కుమార్తె హరిప్రియ ఉన్నారు. తమ కుమార్తెను ఓ ప్రయివేటు స్కూల్లో శుక్రవారం ఉదయం ఎల్‌కేజీలో జాయిన్ చేశారు. సాయంత్రం స్కూలు నుంచి పాఠశాల బస్సులో ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే చిన్నారి బస్సు దిగి ముందువైపు నుంచి ఇంటికి చేరుకోవాలని ప్రయత్నం చేసింది. ఈలోపు బస్సు కదలడం, చక్రాల పడి చిన్నారి స్పాట్‌లోనే చనిపోవడం క్షణాల్లోనే జరిగింది. స్కూలుకు వెళ్లిన తొలి రోజే చిన్నారి మృతి చెందడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
- Advertisement -