Monday, December 8, 2025
E-PAPER
Homeఖమ్మంటూత్ పేస్ట్ అనుకొని ఎలుకల మందు తిని చిన్నారి మృతి

టూత్ పేస్ట్ అనుకొని ఎలుకల మందు తిని చిన్నారి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ధారావత్ మానస (3) అనే చిన్నారి ఈనెల 17న తన ఇంట్లో బ్రష్ చేసుకుంటూ ఉండగా ఎలుకల మందు ట్యూబ్ కనిపించింది. అయితే పేస్ట్ తినే అలవాటు ఉండటంతో పేస్ట్ అనుకోని తింది. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి ఆతరవాత వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. అనంతరం హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -