నవతెలంగాణ-తంగళ్ళపల్లి : డెంగ్యూ వాల్తో ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇంద్ర నగర్ కు చెందిన సారుగు బాలయ్య సంధ్యల దంపతుల కుమార్తె సహస్ర (8) సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండవ తరగతి చదువుతుంది. గత మూడు రోజుల క్రితం సహస్ర అనారోగ్య పాడిన పడటంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇంతకీ నవీన్ కాకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతుండగా వైద్యులు అన్ని పరీక్షలు చేయగా సహస్రకు డెంగ్యూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. చికిత్స పొందుతూ సహస్ర సోమవారం తెల్లవారుజామున మృతి చెందిందని తల్లిదండ్రులు బాలయ్య సంధ్య తెలిపారు.
డెంగ్యూతో చిన్నారి మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES