– బాల్కొండలో విషాదం
నవతెలంగాణ-బాల్కొండ
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో రేబిస్ వ్యాధితో చిన్నారి మృతిచెందింది. మండల కేంద్రానికి చెందిన గడ్డం మహేశ్ కూతురు లక్షణ(11) అక్టోబర్ 1న ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేసింది. దాంతో బాలికకు కుటుంబ సభ్యులు టీకాలు వేయించారు. కానీ తలపై చిన్న గాయమైంది. దానిని గమినించలేదు. ఈ క్రమంలో రెండ్రోజుల కిందట చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆర్మూర్ పట్టణంలోని ప్రయివేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి రేబిస్ లక్షణాలున్నాయని తెలిపారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బాలికను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి శుక్రవారం తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి లక్షణ శనివారం ఉదయం మృతిచెందింది. వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రేబిస్‌తో చిన్నారి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



