Sunday, November 9, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ దేశంలో చిన్నారులు సోష‌ల్ మీడియా వాడ‌కం నిషేధం

ఆ దేశంలో చిన్నారులు సోష‌ల్ మీడియా వాడ‌కం నిషేధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పిల్లలు సోషల్‌ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్య దేశం డెన్మార్క్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్‌ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తున్నది. దీని ప్రకారం, తల్లిదండ్రుల అనుమతితో 13 ఏండ్లు దాటిన పిల్లలు సోషల్‌ మీడియా వాడకానికి కొన్ని షరతులతో అనుమతి ఇస్తున్నట్టు తెలిసింది. ఆన్‌లైన్‌లో విపరీతమైన హింస, స్వీయ హానికి పురిగొల్పే ప్రమాదకర కంటెంట్‌కు పిల్లల్ని దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ డిజిటల్‌ అఫైర్స్‌ మంత్రి కరోలినా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -