జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని
నవతెలంగాణ – వనపర్తి
బాల బాలికలు మంచి స్పర్శ చెడు స్పర్శలను గుర్తించేలాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన పెంపొందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. గురువారం వనపర్తి మండలం శ్రీనివాసపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాల గురించి తెలియజేశారు. విద్యార్థులు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ భారత్ ను పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా ఉదాహరణలతో వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మంచి స్పర్శ చెడు స్పర్శ లపై పిల్లలకు అవగాహన పెంపొందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES