Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సరైన పౌష్టికాహారం అందజేయాలని ఐసీడీఎస్ ఏసీడీపీఓ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలోని శంకర్ తండా, బంగారు చెలిమి తండా, రామచంద్రు తండాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించి, పిల్లల సంఖ్యతో పాటుగా, పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని, టీచర్లు సమయ పాలన పాటించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లు చిన్నారులను తమ పిల్లలుగా భావించి మంచి ఆహారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మమత, మంగమ్మ, స్వరూప రాణి, ఆయాలు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -