Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కెనడి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం 

కెనడి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం 

- Advertisement -

విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ 
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి పట్టణంలోని కెనడి పాఠశాలలో శుక్రవారం ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఆవరణంలో పిల్లలు చేసిన నృత్యాలు పలువుడ్నికరించాయి. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపల్  పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. పాఠశాలలోని  విద్యార్థులకు కసంస పత్రాలను మించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు.

ఈ రోజు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ  జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిల్లల పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ, ఆప్యాయతల కారణంగా, ఆయన మరణానంతరం ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందనీ  పేర్కొన్నారు. చాచా నెహ్రూగా ప్రసిద్ధి చెందిన నెహ్రూ  పిల్లలను ‘జాతి సంపద’గా భావించేవారనీ,  “పిల్లలే దేశ భవిష్యత్తు” అని, వారి సరైన అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తరచుగా చెప్పేవారు. పిల్లల అమాయకత్వం, స్వచ్ఛత, అపరిమితమైన శక్తిని ఆయన ఎంతగానో అభిమానించే వారన్నారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -