Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గిరిజన పాఠశాలలో ఘానంగా బాలల దినోత్సవం

గిరిజన పాఠశాలలో ఘానంగా బాలల దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ కాటారం
కాటారం మండల కేంద్రం లో గల గిరిజన పాఠశాల లో చాచా నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారo గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ ఎన్నో సేవలు అందించడం జరిగిందని, స్వతంత్ర ఉద్యమంలో గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కి నాయకత్వం వహించారని, బ్రిటిష్ పరిపాలన కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో పాల్గొని అనేక సార్లు జైలుకు కూడా వెళ్లారని అన్నారు. భారత ప్రధానమంత్రిగా మూడుసార్లు ఎంపికై భారత దేశ అభివృద్ధి పథంలో నడవడానికి పంచశీల సూత్రాలను కలిగిన ఉద్యమాన్ని ప్రవేశపెట్టి భారతదేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించారని అన్నారు.నెహ్రూ అంటే చిన్నారులకు ఎంతో ఇష్టమని ఆయనను ప్రేమతో చాచా నెహ్రూ అని పిలిచేవారని, ఆయన పుట్టిన రోజును దేశమంతా చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారని అన్నారు. గొప్ప గొప్ప నాయకుల జీవిత చరిత్రను విద్యార్థులు తెలుసుకొని ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు.ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -