Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.!

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ బాలల దినోత్సవం,దేశ తొలి ప్రధాని జయంతి సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థులచే నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలు ఉపాధ్యాయులుగా వేషధారణలో విద్యార్థులకు చదువును భోదించిన విధాన్ని స్వయంగా పాఠశాల గదులలో కూర్చుని వీక్షించినట్లుగా తెలిపారు. అనంతరం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు.భారత స్వాతంత్ర ఉద్యమ నాయకుడు,భారతదేశానికి తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నెహ్రూ, “పిల్లలే దేశ భవిష్యత్తు” అన్నారు అందుకే మనం బాగా చదవాలి,మంచి లక్ష్యాలు పెట్టుకోవాలి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా మంచి విద్య, మంచి విలువలు, మంచి ఆచరణతో ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -