Sunday, August 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనా, రష్యాలు ‘జాయింట్‌ సీ -2025’ విన్యాసాలు

చైనా, రష్యాలు ‘జాయింట్‌ సీ -2025’ విన్యాసాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జపాన్‌ సముద్రంలో చైనా, రష్యాలు ఉమ్మడి నావికా విన్యాసాలను ప్రారంభించాయి. ‘జాయింట్‌ సీ -2025’ విన్యాసాలు రష్యాలోని వ్లాడివోస్టాక్‌ ఓడరేవు సమీపంలోని జలాల్లో ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగుతాయని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరువైపులా జలాంతర్గామి రక్షణ, ఉమ్మడి జలాంతర్గామి వ్యతిరేక, వైమానిక రక్షణ మరియు క్షిపణి వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్స్‌ మరియు ఉరుంకితో సహా నాలుగు చైనా నౌకలు రష్యన్‌ నౌకలతో పాటు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విన్యాసాలు రెండు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొంది. ఈ విన్యాసాల అనంతరం, రెండు దేశాలు పసిఫిక్‌ సంబంధిత జలాల్లో నావికా గస్తీని నిర్వహిస్తాయని తెలిపింది.

చైనా-రష్యాల మధ్య జాయింట్‌ సీ విన్యాసాలు 2021లో ప్రారంభమయ్యాయి. గతేడాది ఈ విన్యాసాలు చైనా దక్షిణ తీరం వెంబడి జరిగాయి. ఆర్థిక రాజకీయ సంబంధాలతో పాటు, రష్యా బీజింగ్‌లు ఇటీవలి సంవత్సరాలలో తమ సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -