నవతెలంగాణ-హైదరాబాద్: గత నెల ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయిల్-అమెరికా జరిపిన క్షిపణి దాడిలో మినాబ్ ప్రాంతంలోని ఓ స్కూల్ ధ్వంసమైంది. ఈ ఘటనలో 175మందికి పైగా బాలికలు చనిపోయారు. ఈ దాడిపై పలు దేశాలు యూఎస్-ఇజ్రాయిల్ దేశాల అధినేతలపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా క్షిపణి దాడిలో మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సాయం అందించనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. ఇటీవల ఇరాన్ ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో విద్యార్థులు మరణించడంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జియాకున్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరానియన్ రెడె క్రెసెంట్ సొసైటీకి చైనా రెడ్ క్రాస్ సొసైటీ అత్యవసర మానవతా సాయంగా 200,000 డాలర్లు (రూ.1.84కోట్లు) అందించాలని నిర్ణయించిందని అన్నారు. ఈ దాడిని అంతర్జాతీయ మానవీయ చట్టాన్ని ‘తీవ్రమైన ఉల్లంఘన’గా అభివర్ణించారు. పాఠశాలలు, పిల్లలపై దాడులు ”అంతర్జాతీయ మానవతా చట్టాన్ని మరింత తీవ్రంగా ఉల్లంఘించడం, మనస్సాక్షి మరియు నైతికత ప్రాథమిక లక్ష్యాన్ని ఉల్లంఘించడం” అని పేర్కొన్నారు.
ఇరాన్ పాఠశాల మృతుల కుటుంబాలకు చైనా సాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



