Sunday, July 27, 2025
E-PAPER
Homeసినిమాయూనిక్‌ స్పై డ్రామాతో 'చైనా పీస్‌'

యూనిక్‌ స్పై డ్రామాతో ‘చైనా పీస్‌’

- Advertisement -

నిహాల్‌ కోధాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా మూన్‌ లైట్‌ డ్రీమ్స్‌ బ్యానర్‌పై అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్‌ స్పై డ్రామా ‘చైనా పీస్‌’.
మేకర్స్‌ శనివారం ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్‌ చేశారు. హీరో సందీప్‌ కిషన్‌ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’టీజర్‌ నాకు చాలా నచ్చింది. ఇది ఒక స్పై ఫిల్మే కాదు. స్పై కామెడీ, సీరియస్‌ కామెడీ కూడా ఉంది. దర్శకుడు ఈ కథని నమ్మాడు. నమ్మింది చిత్రీకరించాడు. ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే నిహాల్‌ తపన నాకు బాగా నచ్చింది’ అని అన్నారు.
‘ఒక దేశభక్తి సినిమా తీస్తూ ‘చైనా పీస్‌’ అనే టైటిల్‌ పెట్టడం వెరీ ఛాలెంజింగ్‌. మేము అన్ని విభాగంలోనూ జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని తీర్చిదిద్దాం’ అని డైరెక్టర్‌ విశ్వనాథరెడ్డి చెప్పారు. హీరో నిహాల్‌ మాట్లాడుతూ, ‘ఒక్కొక్క సినిమా ఒక కొత్త వాయిస్‌ని తీసుకురావాలి. డైరెక్టర్‌ విశ్వనాథ్‌ ఈ సినిమాతో అలాంటి ఒక కొత్త వాయిస్‌ని తీసుకొస్తారు. గ్రేట్‌ రైటింగ్‌ స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌తో ఒక సాలిడ్‌ కమర్షియల్‌ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్‌ ఉండాలో అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి’ అని తెలిపారు.
‘ఈ సినిమా మాట్లాడుతుంది .. మీ అందరికీ నచ్చుతుంది. బాగా రీచ్‌ అవుతుందని నమ్మకం ఉంది’ అని హీరో సూర్య శ్రీనివాస్‌ చెప్పారు. హర్షిత బండ్కమూరి, కమల్‌ కామరాజు, గులాసీ, రఘు బాబు, రంగస్థలం మహేష్‌, శ్రీనివాస్‌ వడ్లమాని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాథ రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: సురేష్‌ రగుతు, సంగీతం: కార్తీక్‌ రోడ్రిగ్జ్‌, ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -