నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ఇండియా-చైనా దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజింగ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 22 నుంచి ఆన్‌లైన్ వేదికగా వీసాకు అప్లకేషన్స్ ప్రారంభకానున్నాయి. ఈ మేరకు ఆ దేశ రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సోమవారం వెల్లడించింది. ఆన్‌లైన్ వేదికగా దరఖాస్తులు సమర్పిస్తే.. త్వరితగతిన వీసాకు బీజింగ్ ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని భారత్‌లోని ఆదేశ రాయబారి అధికారి జు ఫీహోంగ్ పేర్కొన్నారు. గతంలో ఇరుదేశాల మధ్య బార్డర్ వివాదాల కారణంగా వీసా విధానాలపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇటీవల పలు దఫాలుగా చర్చల అనంతరం రెండు దేశాలు పర్యాటకం, వ్యాపారాల వృద్ధి కోసం వీసా విధానాలను సడలించారు.
భారత వీసాలపై చైనా కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



