- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9కు పోటీగా తియాన్‌లాంగ్-3 రాకెట్‌ను శుక్రవారం ఆ దేశం ప్రయోగించింది. కానీ అసాధారణ సమస్యతో ఆ రాకెట్ విఫలమైనట్లు చైనా వెల్లడించింది. బీజింగ్‌లోని స్పేస్ పయనీర్ అనే ప్రయివేటు సంస్థ తియాన్‌లాంగ్-3ని రూపొందించింది. ‘‘ప్రయోగ సమయంలో రాకెట్ ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంది. ఈ కారణంగా ప్రయోగం విఫలమైంది. దీనికి గల కచ్చితమైన కారణంపై దర్యాప్తు జరుగుతోంది.’’ అని స్పేస్ పయనీర్ సంస్థ పేర్కొంది.
- Advertisement -



