Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నషక్కర్గా జీపీ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

చిన్నషక్కర్గా జీపీ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకుడు దిగంబర్ శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి ఆ గ్రామపంచాయతీ పరిధిలోని జనాలు ఆయనకు మద్దతుగా భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు నాయకత్వంలో గ్రామాలకు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో సర్పంచుగా ఎన్నికైతే, గ్రామాన్ని మరింతగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి తీరుస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు సర్పంచ్ గా గెలిపించడానికి వారి మద్దతు అండగా ఉందని వారికి ఎల్లవేళల రుణపడి ఉంటానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -