- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అగ్ర కథానాయకుడు చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని, తన పేరు, ఫొటో, వాయిస్‌లను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో చిరంజీవి అనుమతి లేకుండా తన పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



