నవతెలంగాణ-హైదరాబాద్ : తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. పాలిటిక్స్ కు తాను దూరంగా ఉన్నా కొంత మంది నేతలు నన్ను విమర్శిస్తూనే ఉంటారని, సోషల్ మీడియాలో నాపై అవాకులు చవాకులు పేలుస్తుంటారని అన్నారు. రాజకీయ విమర్శలపై నేను పెద్దగా స్పందించనని సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలు అన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ అడ్డుకుని ఎదురుతిరిగింది. ఆ వీడియోను నేను చూశాను. గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని అందువల్లే నేనంటే ఆ మహిళకు గౌరవమని తెలిసిందన్నారు. నాపై చెడు రాతలు రాసేవారికి, మాట్లాడేవారికి నేను చేసే మంచే సమాధానం అని చిరంజీవి అన్నారు. మంచి చేస్తూ.. మంచి చేసే తమ్ముళ్లకు సహకరించడమే నాకు తెలుసన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై నేను స్పందించనని నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు అన్నారు. ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.
రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES