– కోశాధికారిగా వంగూరి రాములు
– శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఎస్వీ రమ
– ఆఫీసు బేరర్లుగా 31 మంది
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చుక్క రాములు, పాలడుగు భాస్కర్, కోశాధికారిగా వంగూరు రాములు తిరిగి ఎన్నికయ్యారు. మెదక్ పట్టణంలో మూడు రోజులపాటు కొనసాగిన సీఐ టీయూ ఐదో రాష్ట్ర మహాసభల్లో చివరి రోజైన మంగళవారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రామిక మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఎస్వీ రమ తిరిగి ఎన్నికయ్యారు. ఆఫీసు బేరర్లుగా 31 మందిని ఎన్నుకోగా… అందులో ఉపాధ్యక్షులుగా ఎస్ వీరయ్య, ఆర్ సుధాభాస్కర్, భూపాల్, ఎస్వీ రమ, కళ్యాణం వెంకటేశ్వరరావు, టి వీరారెడ్డి, పి జయలక్ష్మి, జె మల్లిఖార్జున్, వీఎస్ రావు, కె ఈశ్వరరావు, టి రాజారెడ్డి, ఆర్ త్రివేణి, కార్యదర్శులుగా జె వెంకటేశ్, ఎ ముత్యంరావు, బి మధు, జె చంద్రశేఖర్, బి మల్లేశ్, ఎం పద్మశ్రీ, కూరపాటి రమేష్, పి శ్రీకాంత్, ఎం వెంకటేశ్, ఎజే రమేష్, రాగుల రమేష్, కె గోపాల స్వామి, కాసు మాధవి, పి సుధాకర్, జి కవితతోపాటు ఒక కో-ఆప్షన్ సభ్యుణ్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 139 మందితో రాష్ట్ర కౌన్సిల్‌ను, 103 వర్కింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. మహాసభ ప్రతినిధులకు మూడు రోజుల పాటు అన్ని సౌకర్యాలు కల్పించిన ఆహ్వాన సంఘానికి మహాసభ ధన్యవాదాలు తెలిపింది.
రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా చుక్క రాములు, పాలడుగు భాస్కర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



