- Advertisement -
నవతెలంగాణ – రాయపోల్
లోక రక్షకుడు యేసుక్రీస్తు జన్మదినం సందర్బంగా క్రిస్టమస్ పండగ కోసం రాయపోల్ , దౌల్తాబాద్ మండలాల వ్యాప్తంగా గల చర్చీలను రంగు రంగుల వెలుగులతో అలంకరించారు. బుధవారం రాత్రి నుండి ప్రత్యేక ప్రార్థనలు మొదలు పెట్టి అర్థరాత్రి బాలయేసు జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. రాయపోల్ మండలంలో తిమ్మక్ పల్లి, దౌల్తాబాద్ మండలంలో పేరేన్నిక గల శౌరీపూర్ చర్చి అందంగా అలంకరించారు. గురువారం క్రిస్టమస్ పండగ సందర్బంగా ప్రత్యేకంగా ఫాదర్ లచే ప్రార్ధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -



