Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంసిఐటియు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నిక

సిఐటియు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నిక

- Advertisement -



నవతెలంగాణ విశాఖపట్నం: ఎయు కన్వెన్షన్‌ సెంటర్‌ (అనతలవట్టం ఆనందన్‌ నగర్‌) వేదికగా … జరుగుతున్న సిఐటియు అఖిల భారత మహాసభలు ఆదివారంతో ఐదో రోజుకు చేరుకున్నాయి. చివరి రోజు నూతన కమిటీని ఎన్నుకున్నారు. సిఐటియు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా సుదీప్ దత్తా, యలమరం కరీం, కోశాధికారిగా ఎం.సాయి బాబు ఏక్రగీవ ఎన్నికయ్యారు.

అఖిల భారత ఉపాధ్యక్షులుగా తపన్ సేన్, కె. హేమలత, టీ.పీ. రామకృష్ణన్, ఎ.సౌందరరాజన్, జె. మెర్సీకుట్టి అమ్మ, అనాది సాహు, పి నందకుమార్, డి.ఎల్. కారాడ్, మాలతి చిట్టిబాబు, కె చంద్రన్ పిళ్లై, బిష్ణు మహంతి, చుక్క రాములు, జి బాబిరాణిలను మహాసభ ఎన్నుకుంది.

కార్యదర్శులుగా ఎస్.దేవ్ రాయ్, కాశ్మీర్ సింగ్ ఠాకూర్, జి. సుకుమారన్, డి.డి. రామానందన్, ఏఆర్ సింధు, ఎస్. వరలక్ష్మి, మీనాక్షి సుందరం, ఉషా రాణి, మధుమిత బందోపాధ్యాయ, ఆర్. కరుమలైయన్, తపన్ శర్మ, ప్రమోద్ ప్రధాన్, కెఎన్ ఉమేష్, సిహెచ్ నరసింగరావు, దీపా క్రజన్, లలిత్ మోహన్ మిశ్రా, పాలడుగు భాస్కర్, కెఎన్ గోపినాథ్, జియా ఉల్ ఆలం, శంకర్ దత్తా, ఎస్ కన్నన్, జిబాన్ సాహా, సురేఖ, శాశ్వత ఆహ్వానితులు ఎ.కె. పద్మనాభన్, మానిక్, ఎ.వి.నాగేశ్వరరావు లను మహాసభ ఎన్నుకుంది.

తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత ఉపాధ్యక్షులుగా చుక్క రాములు, అఖిల భారత కార్యదర్శిగా పాలడుగు భాస్కర్ ఎన్నికయ్యారు. జాతీయ వర్కింగ్ కమిటి సభ్యులుగా యస్వీ రమ, జె.వెంకటేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, రాగుల రమేష్ లు ఎన్నికయ్యారు.








- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -