‘మహీంద్రా ట్రాక్టర్స్’లో సీఐటీయూ ఘనవిజయం
ఈ విజయం ‘మహీంద్రా’ కార్మికులకు అంకితం : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ- జహీరాబాద్
మహీంద్రా ట్రాక్టర్స్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూ ఘనవిజయం సాధించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెజారిటీ పరిశ్రమల్లో సీఐటీయూ వరుస విజయాలతో తమ సత్తా చాటుతూనే ఉంది. మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమలో వరుసగా నాలుగవసారి విజయం సాధించి పరిశ్రమ చరిత్రని తిరగరాసిన ఘనత సీఐటీయూకే దక్కుతుంది. ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కార్మికులు భారీగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. ఈ విజయం కార్మికుల ఐక్యతకు నిదర్శమని, ఈ విజయాన్ని ట్రాక్టర్ ప్లాంట్ కార్మికులకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.
కార్మికుల వేతన ఒప్పందం, సౌకర్యాల సాధన విషయంలో సీఐటీయూ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. కార్మికులు ఇదే ఐక్యతను భవిష్యత్తులోనూ చాటాలని అన్నారు. కార్మికులను ఎన్నో రకాలుగా బీఆర్టీయూ ప్రలోభాలకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడినా భయపడకుండా సీఐటీయూకు ఘనవిజయం సాధించి పెట్టిన కార్మిక వర్గానికి జేజేలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, ఉపాధ్యక్షులు అతిమేల మానిక్, జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ సీఐటీయూ కన్వీనర్ మహిపాల్, యూనియన్ ప్రధాన కార్యదర్శి మహేశ్వర్, యూనియన్ నాయకులు గణేష్, వంశీకృష్ణ, ఇతర యూనియన్ల నాయకులు రాజిరెడ్డి, సీహెచ్ నరేష్, నర్సయ్య, నారాయణ, సందీప్ రెడ్డి, రాజు నాయకులు పాల్గొన్నారు.
కార్మికులకు అండగా సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



