నవతెలంగాణ – ఆర్మూర్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అందాలను ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వాసులు బుధవారం తిలకించారు. మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్ మూర్ కు చెందిన పలువురు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ క్వార్టర్ లోని ప్రకృతి అందాలను, పచ్చందనాలను, ప్రాజెక్టులోని నీటి తుంపర్ల అందాలను ప్రత్యక్షంగా వీక్షించి ఎంతగానో ఆనంద భరితులయ్యారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లోని పచ్చిక బయలు ఆహ్లాదంగా ఆనందదాయకంగా వంటలను సంబురంగా ఆరగించి, ఆహ్లాదకరంగా కబడ్డీ, కోకో, క్రికెట్ ఆటలను ఆడడంతో పాటు ప్రాజెక్టు శివారులలోని నీటి అందాల మధ్య ఫోటోలను తీసుకొని మంత్రముగ్ధులై ఆనంద పరవశులయ్యారు.
పలు సినీ గేయాలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రత్యేకంగా గోదావరి నది ఒడ్డున బ్యాక్ వాటర్ శివారులో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ప్రముఖ హీరో వెంకటేష్ సినిమా లోని గోదారి గట్టు పై అనే పాట పై చేసిన నృత్యం అందర్నీ ఆకట్టుకునేలా చేశారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అందాలను సందర్శించిన వారిలో యల్ల గంగారెడ్డి పద్మ దంపతులు, రాజేందర్ రెడ్డి లలిత దంపతులు, మోహన్ రెడ్డి పద్మ దంపతులు, సంతోష్ రెడ్డి అనిత దంపతులు, సాయి రెడ్డి కావ్య దంపతులు, మహేష్ రెడ్డి హారిక దంపతులు , గోరింటాల నరేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ అందాలను తిలకించిన పట్టణవాసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES